స్నేహం విలువ;-సి.హెచ్.ప్రతాప్
 సృష్టిలో ఒక్క స్నేహం తప్ప అన్ని బంధాలను దేవుడే సృష్టిస్తాడు అని మన పెద్దలు చెబుతారు. మానవాళికి వరంగా కేవలం స్నేహితులను మాత్రం ఎంపిక చేసుకునే అవకాశం మనకే ఇచ్చాడు. అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే మాట స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. మంచి స్నేహాతుడిని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే వారు జీవితాంతం సంతోషంగా గడుపుతారు.
చీకటిపడితే మన నీడే మనల్ని వీడుతుంది కానీ, స్నేహం ఎప్పుడూ మనతోనే ఉంటుంది.మదిలోని మంచితనానికి మరణం లేదు. ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు. అనుక్షణం తపించే స్నేహానికి అవధులు లేవు. స్నేహానికి కులం లేదు స్నేహానికి మతం లేదు స్నేహానికి హోదా లేదు బంధుత్వం కంటే గొప్పది, వజ్రం కన్నా విలువైనది స్నేహం ఒక్కటే!భాష లేనిది, బంధమున్నది, సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే!మౌనం వెనుక మాటను,
కోపం వెనుక ప్రేమను,నవ్వు వెనక బాధను అర్థం చేసుకునే వాడే స్నేహితుడు.మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం.
స్సందేహంగా, చిన్ననాటి నుండి మన మంచి స్నేహితుల సహవాసంలో మనం ఎల్లప్పుడూ కొత్త మరియు ఉత్తేజకరమైనది నేర్చుకుంటాము. స్నేహితులతో గడిపిన ఆహ్లాదకరమైన సమయం ఒక రకమైన సంతోషాన్ని వ్యక్తపరచలేనిది. మీరు గ్రూప్ స్టడీ చేసినా లేదా ఎవరి బర్త్‌డే పార్టీని ఆస్వాదించినా అది స్నేహితులతో ఎప్పుడూ ఆనందించేలా ఉంటుంది.స్నేహం ఎప్పుడూ ప్రజల ఆర్థిక స్థితికి కట్టుబడి ఉండదు. ఒక రాజు పేద బిచ్చగాడికి నిజమైన స్నేహితుడు కావచ్చు మరియు పేద కార్మికుడు ధనిక పారిశ్రామికవేత్తకు మంచి స్నేహితుడు కావచ్చు. శ్రీకృష్ణుడు పేద సుదామునితో షరతులు లేని నిజమైన ప్రేమగల స్నేహంలో ఉన్నాడని మనందరికీ తెలుసు. కృష్ణుడు మరియు సుదాముని స్నేహం మనందరికీ ఆదర్శప్రాయం.  
ఆస్తులు లేని వారు కాదు పేదవారు, ఆపదలో అదుకునే స్నేహితులు లేనివారు నిజమైన పేదవారు. ప్రతీ వ్యక్తి జీవితంలో స్నేహబంధం ప్రత్యేకమైనది. మనతో రక్త సంబంధం లేకపోయినా, మన వెనక బంధువులు ఎవరూ రాకపోయినా, మనల్ని వెన్నుతట్టి నడిపించేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది స్నేహితులే. 
కామెంట్‌లు