ఆశయం;- గుగ్లోత్ పూజ-ఎనిమిదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9311244843
    అనగనగా నర్సింహులపల్లి అనే ఊరిలో స్వాతి అనే అమ్మాయి ఉండేది. స్వాతికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. స్వాతి అనాధాశ్రమంలోనే పెరుగుతుంది. బడికి వెళుతూ చదువుతూ మంచి పేరు బడిలో తెచ్చుకుంది. పాఠశాలలో ఒక రోజు సైన్స్ ఫెయిర్ జరుగుతుంది. స్వాతి కష్టపడి మంచి ప్రాజెక్టు తయారు చేసి తీసుకువెళ్లింది. స్వాతి తీసుకు వెళ్లినటువంటి ప్రాజెక్టుకు మొదటి బహుమతి లభించింది. 
               తనకు మొదటి బహుమతి వచ్చినందుకు సంతోషపడిన స్వాతి తాను కళ్ళు తెరవక ముందే తల్లిదండ్రులను కోల్పోయానని బాధపడింది. తాను పెద్దగా అయ్యాక డాక్టర్ అయ్యి సేవ చేయాలని ఆశయం పెట్టుకుంది. స్వాతి అనాధాశ్రమంలో ఉన్న బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అయింది. తాను అనాధాశ్రమంలో వృద్ధులకు, అనాధలతో పాటుగా చాలామందికి ఉచితంగా వైద్య సేవ చేసి స్వాతి మంచి పేరు తెచ్చుకుంది. తల్లిదండ్రులు లేకుండా అనాధ అయిన స్వాతి ఆశయం నెరవేర్చుకున్న తీరు ఎందరికో ప్రోత్సాహాన్ని అందించింది.

కామెంట్‌లు