=ఆకాశవాణి విజయవాడ కేంద్రం;ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 నాతో పాటు రామ్మోహన్ రావు నండూరి సుబ్బారావు లింగరాజు శర్మ బందాగారితో పాటు నాటక పరిచయం లేని ఎప్పుడూ నాటకంలో గొంతు అరువివ్వని అమంచర్ల గోపాల్ రావు, కందుకూరి రామభద్ర రావు ఏడిద కామేశ్వరరావు లాంటి వాళ్ళు పాల్గొనడం కూడా ఆ నాటకానికి వన్నెతెచ్చింది ఆ గాజు మేడ పగిలిపోవడం రచయిత కల చెదిరిపోవటంతో ఆ రచన ముగుస్తుంది అదొక కళాఖండం  తర్వాత రచయితగా రేడియోకి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఒకే ఒక వ్యక్తి  వింజమూరి శివ రామారావు గారువిశ్వ కళాపరిషత్ వారి కళా ప్రపూర్ణ గౌరవాన్ని కూడా పొందిన మేధావి  నేను రేడియోలో చేరిన మూడవరోజు నటించడం నాటకం అన్నపూర్ణ శ్రీకృష్ణదేవరాయలు ప్రియురాలు అన్నపూర్ణ చరిత్రలో లేని ఊహాజనిత కథతో నాటకీయత ఉట్టిపడేలా వ్రాశారు శివరామారావు గారు అన్నపూర్ణ గారు వింజమూరు లక్ష్మి  శ్రీకృష్ణదేవరాయలుగా నేను గాత్రాన్ని అందించాం  శివరామారావు గారి వ్యక్తిత్వం చాలా గొప్పది ఆయన వ్రాసిన పాటలు గాని తమిళ తిరుప్పావు ఆంధ్ర అనువాదం పాశురంగానే నాటకం కానీ 15 నిమిషాలు 30 నిమిషాలు వారైనా హుషారుగా రాసినప్పుడు ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా కాలనీయమన్ని పాటించే రచయిత  ఆయన ఓ మంచి పాట రాసి శ్రీరంగం గోపాల రత్నం గారితో అమ్మ నీ కోసమే రాశాను రా ఈ పాట నువ్వే పాడాలి అమ్మ నీకు గాత్రంతోనే ఈపాటకి జీవం వస్తుంది అనేవాడు  మరో పాట రాసి లలిత సంగీత బాణీలో వింజమూరు లక్ష్మి సమీపించి అమ్మ లక్ష్మి నువ్వే పాడాలి రా ఈ పాట అంటూ చంటి పిల్లల నుంచి ఎలాంటి ఫలితం రాబడతామో అలా సాధించగలిగిన మేధావి.అన్నపూర్ణ నాటకం ప్రసారం కాగానే నన్ను అభినందించిన మొదటి వ్యక్తి ఈ రచయిత  బందాగారు కానీ, ఓలేటి గారిగాని వారికి ఏదైనా మంచి పాట కావలసి వస్తే శివరామారావు గారి ఒక మంచి టీ తెప్పించి ఒక సిగరెట్  ఇప్పించి అన్నగారు ఈ విషయంగా చక్కటి పాట కావాలి అరగంటలో మీరు ఇస్తే ఆనందం అని కాకా పడతారు వారిని అక్కడ కూర్చోబెట్టి 15 నిమిషాల్లోపే వారికి కావాల్సిన పద్ధతిలో ఒకటి రమ్యంగా అందించి   పంపిస్తారు ఆయన  జీవితంలో ఎన్ని కష్టాలను అనుభవించిన ఎప్పుడూ చిరునవ్వు చిందులాడుతూనే ఉంటుంది వారి ముఖం పైన.
కామెంట్‌లు