నేను తోలనంటే తోలను నా పోరన్ని ప్రైవేటు స్కూళ్లకుల- అంకాల సోమయ్య దేవరుప్పులజనగామ9640748497
పల్లవి;
నేను తోలనంటె
తోలనూ ---2
నా పోరన్ని ---ప్రైవేటిస్కూళ్లకు---
కేజీల చొప్పున ,ఆడ   చదువు అమ్ముతుంటారు  ---2

1చరణం/
టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్
రకరకాల డ్రెస్సులంటు
టైబెల్టు బూట్లంటు
 రవాణా ఫీజులని
 స్పెషల్ ఫీజు మంత్లీ ఫీజంటు---
పీల్చి పిప్పిచేస్తారు---2

/నేను/
2చరణం/

అనుభవం ఉన్నట్టి సార్లక్కడ ఉండరు--
ఈ యేడు ఉన్న సారూ ,మరో ఏడు రానే రాడు,
ఆటపాటగా చదువు ,
ఆడ నేర్పనే నేర్పరు
కాన్సెప్టు వదిలేసి
బట్టి కొట్టే సదువుగదా---
/నేను/

3చరణం/

నెలనెలా ఫీజులు ఠంచనుగా కట్టాలి--
ఫీజులు కట్టకుంటే అడ్మిషన్ క్యాన్సిల్ అంట
ఏం చదువు చెబితివని ఎదిరించి అడగబోతే---
మీ పిల్లోడు హోం వర్క్ చేయడని--- నింద మనమీదేసే----2 

4చరణం/
రిక్షాతొక్కేఓ అన్న
రోజువారి కూలన్న
నీ కొడుకు గొప్పోడు కావాలని--
నువ్వు పస్తులుండి 
 రక్త మమ్మీ ప్రైవేటీ స్కూల్లే స్తే
నెలనెలఫీజందక పోరాడు--
బడికి దూరమైనడా-- పోరడు---2
5చరణం/
సర్కారు బడి ఉంది
సమస్యలు ఆడున్నవి
 ఊరంతా తలుచుకుంటే
బడిబాగు పడిపోదా
మన పోరనికి మంచి చదువు రాదా
పైసా ఖర్చు లేనిచదువు మనకు దక్కదా -- !?

/నేను/
కామెంట్‌లు