మహనీయుల మాటలు;- -గద్వాల సోమన్న,9966414580
వెన్నెల రేయి హాయి హాయి
కలపాలోయ్! చేయి చేయి
సమాజ శ్రేయస్సు కోరి
గొప్ప పనులు చెయ్యి చెయ్యి

ఆత్మసంతృప్తి తృప్తి
అపద వేళలో  యుక్తి
ఉండలోయ్! దేశ భక్తి
కలసి ఉన్న మహాశక్తి

ముఖమున విరిసిన నవ్వులు
గుబాలించే పువ్వులు
ప్రకాశించే దివ్వెలు
సునాదం పంచు మువ్వలు

నాలుకను చేయి అదుపు
ఉజ్వల భవితకై పొదుపు
చేసుకుంటే మలుపు
ఉండదు బ్రతుకులో కుదుపు

శ్రమైక్య జీవనం గెలుపు
చరిత్ర ఇదే ఇదే తెలుపు
మనసుతో మనసు కలుపు
లెక్క చేయొద్దు అలుపు

పొలంలో కలుపు మొక్కలు
ఎదగనీయవు మొలకలు
జీవితాన దుర్గుణాలు
వృద్ధికవి అవరోధాలు


కామెంట్‌లు