వనితలంతా కలిసి;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మూతిమీద మీసమైనా మొలవలేదు
మూలఱాయి వంటి మా పాపలపయిన
మూర్ఖముగా ప్రవర్తించి మెదలబోకు
మూటగట్టిన అవలక్షణాల ప్రోవునీవు
మూసుకొన్నవా నీకనులు ఓరి పాపి
మూషికమొఖమువాడ నీ దుంపతెంచ
మూలమైనట్టి పవిత్ర ప్రేమ రాహిత్యుడా
మూల్యమును చెల్లింతువింక నీ వికృతచర్యలకును
మూకాంబికా అవతారమే కదా ప్రతి స్త్రీ
మూసబోసిన దుష్ట దుర్మార్గుడా 
మూలమూలలకు నిన్ను తరిమికొట్టి
మూలమే నీకు లేకుండ జేయుదురు  వనితలంతా కలిసి!!!

{మూలఱాయి=వజ్రమణి;మూషికము=ఎలుక;
మూలము=ప్రారంభము,ఆధారము;
మూల్యము=వెల,ఖరీదు;మూకాంబిక=పార్వతీమాత}
**************************************
కామెంట్‌లు