గత స్మృతులు;- చట్టి లక్ష్మి
కుసుమ ధర్మన్న కళా పీఠం 
==================== 
కరిగిపోయిన కాలంలో  
నువ్వు నాపై చూపిన వలపులు సుగంధ పరిమళాలతో కలిసి 
నాలో నిత్యం వసంత గీతికలనే
ఆలపిస్తుంటే 

అవి నా ఎద లోతులో పొంగి 
సునామీ లా ముంచెత్తి  నన్ను ఉక్కరి బిక్కిరి చేస్తుంటే 
ఆ మధురమైన రసమయజీవితం
తలచుకొని నా ఉల్లము ఉత్సాహంతో ఉరకలు వేసి ఊయలలూగుతుంటే 
ఒకరికొకరమై పాలు నీరులా కలసిన 
మన అనురాగాల మౌనబంధం
కమ్మని కోయిల గీత మాలికలై 
నా చెవులకు వీనుల విందుగా 
వినిపించి నాకు మనోల్లాసం కలిగిస్తుంటే నాకు అంత కంటే 
అమృతతుల్యం. మరే ముంటుంది 

ఇరువురం దూరమైనా
గతించిన తీయని జ్ఞాపకాలను 
ప్రతి నిమిషం గుర్తుకొచ్చి 
అనుభవించిన అనురాగల 
గత స్మ్రుతులను పదే పదే నిరంతరం నే తలచుకొని 

ఆ అపరూపమైన రోజులు మరల తిరిగి రావన్న నిరాశాభావమే విషాదమై నా హృది లో కాలకూట విషం గా నిలచిపోయింది 

వసంతం లో తిరిగి చిగురులు తొడిగే పకృతి శోభలా 
నాలో యేమూలనో దాగివున్న  చిన్న ఆశా దృక్పథం తో మళ్లీ 
మనలో చిరు నవ్వులు చిందించి 
వెన్నెల కురిపించే మధుమాసం 
మళ్లీ మన కోసం వస్తే బాగుండు 
అప్పుడు ఇరువురి జీవితం *అందమే ఆనందం*మౌతుంది కదా ప్రియా!

కామెంట్‌లు