యోగము;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

జగములోన మనసంగము ఒకభోగము ఒకభాగము
ఏ రంగమునైనకూడ అధికారము సాంగము
భగవంతుని ఆశీః సారము
అని తలచి పొంగము లొంగము మేము
అది జనులకు సేవను అందించు ఒకబీగము
భారము లింగము మీదను మోపి భగమునకై వాగము
మన త్యాగము ఒక రాగము ఒక నగము
మన భగము ఒక యోగము ఒక యాగము
ఇందులోన స్త్రీ పురుషులు సగము సగము
పరివారము నతిగా నమ్మక
మన ఆగము మనము ఒప్పుకున్నప్పుడు
ఆ లింగము మనకు ఇచ్చు యోగము !!!

{సంగము=స్నేహము; భోగము=సుఖము; 
సాంగము=మొత్తము; బీగము=తాళపుచెవి; 
భగము=కీర్తి; వాగము=వదరము; రాగము=సంతోషము; 
నగము=కొండ; యోగము=ప్రయత్నము, ద్రవ్యము, ఔషధము; 
యాగము=క్రతువు; ఆగము=అపరాధము}
*************************************


కామెంట్‌లు