తొలికవితలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తొలికోడి
కూసింది
నిదురనుండి
లేపింది

తొలికిరణం
ప్రసరించింది
తలపైవెలుగులు
చిమ్మింది

తొలిపువ్వు
తోటలోపూచింది
త్వరగారమ్మని
తొందరాచేసింది

తొలితలపు
తట్టింది
తొలికవిత
పుట్టింది

తొలిపత్రిక
ఇంటికొచ్చింది
తొలిగానాకవితను
మోసకొచ్చింది

తొలికవితాపోటీ
జరిగింది
తొలిగానాకవిత 
నిలిచింది

తొలిపురస్కారం
నాకుదక్కింది
తొలిబహుమానం
నాదరిచేరింది

కవిసమ్మేళనములో
తొలిగా నన్నుపిలిచారు
సన్మానాల్లో
తొలిగా నన్నుసత్కరించారు

తొలిగా
అన్నిటా నేనుంటా
తొలిస్థానంలో
నాకవితలు నిలుపుతా

తొలిగా
చదువుతారా
తొలిగా
స్పందిస్తారా

తొలిపేరు
తెచ్చుకుంటా
తొలిసంబరాలు
జరుపుకుంటా

తొలిపుస్తకము
తీసుకొస్తా
సుమసౌరభాలు
వెదజల్లుతా


కామెంట్‌లు