వాసుకి సర్పం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మంథరపర్వతాన్ని తాడుగా చుట్టి దేవదానవులు పాలసముద్రాన్ని చిలికారు అని మనకు తెలుసు.ఆతాడు వాసుకి అనే పాము.దానినే శివుడు తనమెళ్లో వేసుకున్నాడు.గరుత్మంతుడు వాసుకి ని చంపి తినాలని వస్తే వాసుకి గుహలో నక్కి దాక్కున్నాడు.గుహబైట బైఠాయించిన గరుడుని పై కళ్లతో నిప్పులు కురిపిస్తూ ఉంటే ఆధాటికి తట్టుకోలేక గరుడుడు వెళ్లి పోయాడు. వాసుకి శివుని గూర్చి తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొందాడు.శివుడు వాసుకి తో ఇలా అంటాడు " తారకాసురుని చంపటం కోసం నాకు సుబ్రహ్మణ్యస్వామి పుడతాడు.దేవసేనతో పెళ్లి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు జరుగుతుంది. నీకు గరుడుని వల్ల అపకారం జరగదు" అని అభయం ఇచ్చాడు శివుడు.శివానుగ్రహంతో ఆదిశేషుడు భూమి ని తన పడగలపై మోస్తున్నాడు.ఆదిశేషుని పడగలపై వాసుకి ఆయన పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు.ఆదిశేషువు శివలింగం పై పడగలను గొడుగు గా పట్టి ఉంటాడు.
శివుని శరీరం అంతా పాములే. ఆయనకు నాగాభరణుడు అని పేరు.మణినాధం అనే పాముకి గరుత్మంతుడు అంటే మహాభయం.అందుకే శివా శివా అని నామస్మరణ చేస్తూ ఉంటాడు.అందుకే ఆయన దయతో గరుడుని వల్ల ప్రాణభయం తప్పింది.కాలాన్ని సర్పంతో పోలుస్తారు.పాము వంకరటింకరగా నడు‌స్తుంది.మన మనసు ఇంద్రియాలు కూడా చలిస్తూ వంకరటింకర ఆలోచనలు చేస్తుంటాయి.ఇకపాములో ఇంకో విశేషమేమిటంటే చుట్ట చుట్టుకొని ఉంటుంది.ఏకాస్త అలికిడైనా తలమాత్రం ఎత్తు తుంది కానీ మిగతా శరీరంని అస్సలు కదపదు.కుక్కి క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి కి ప్రసిద్ధి.కుక్కి లింగం చాలా ప్రసిద్ధి . చర్మవ్యాధులు పోతాయి అని నమ్మకం. శివుడికి పన్నగ భూషణుడు నాగభూషణుడు అని పేర్లు.పైగా ఆయన కొడుకులు వాహనాలు ఎలుక నెమలి.పాముకి శత్రువులు.ఐనా సామరస్యంగా  స్నేహభావంతో మెలుగుతూ వసుధైక కుటుంబం అనిపిస్తున్నాయి.🌹
కామెంట్‌లు