సుప్రభాత కవిత ; - బృంద
మగత నిదురలో
మది కన్న కలలు
ఉల్లాసంగా ఊదారంగు
చీరచుట్టుకుని ఎదురొస్తే!!!

నీటిలో తమ నీడ 
తామే చూసుకుని
మురిసిపోతున్న కొమ్మల 
అందం చూసి మనసు మురిస్తే!

రాలుపూల రాదారి
పాదాలకు హత్తుకుని
ముళ్ళూ రాళ్ళూ తగలకుండా
బ్రతుకుదారి నడిపిస్తే!

ఆ గమనం అద్భుతం!
ఆ పయనం ఆహ్లాదం!
ఆ పవనం  అపురూపం!
ఆ సుమవనం అద్వితీయం!

రమణీయ కాంతుల
కమనీయ సౌందర్యం
అరుణోదయాన కనిపించే
మనోహర దృశ్యం.

ఉల్లాసాన్ని నింపి
ఉత్సాహాన్ని పంచే
ఉద్వేగభరితమైన
ఉషోదయ వేళ

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు