నారాయణా!;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 నారాయణా! 
అంత హడావుడిగా ఎక్కడికయ్యా వెళుతున్నావ్
నేనిక్కడ నీకోసం పడిగాపులు పడుతున్నాను
నన్నొదిలేసి అలా ఇంకెక్కడికో వెళుతున్నావ్
దయలేదా?
నీకై నేనెంత పరితపిస్తున్నానో తెలుసా?
నీవుగాక ఇంకెవరయ్యా నన్ను రక్షించేది?
దేవదేవా ఎవరుపిలిచినా పరుగున వెళతావే 
మరి నాదగ్గరకు ఏలరావు నన్నేల ఏలరావు హరీ?!
గరుడవాహనా  నీభక్తులను నీవుగాక 
ఇంకెవరూ కాపాడలేరు సుమా!
దేవాది దేవా సత్వరంగా నన్నునీదరిజేర్చుకో
నీ నామమే నిరతము స్మరించే నన్ను
నీ భక్తపరమాణు పదధూళిగా భావించి
నన్నాదుకో హరీ! నారాయణా!
**************************************
కామెంట్‌లు