శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
501)కపీంద్రః -

వానరులకు ప్రభువైనవాడు 
అగ్ని సమానుడైనట్టి వాడు 
విష్ణుమూర్తిగా నున్నవాడు 
నారింజవర్ణమున నున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
502)భూరి దక్షిణః -

యజ్ఞదక్షిణలనిచ్చుచున్నవాడు 
భూరిదానములు అందించువాడు 
సువర్ణమును దానమిచ్చువాడు 
అధికమైన వితరణీయువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
503)సోమపః -

యజ్ఞయాజకుడై యున్నవాడు 
సోమరసపానము జేయువాడు 
పరాక్రమము చూపించువాడు 
కర్పూరసమానుడైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
504)అమృతపః -

అత్మానందరూపుడైయున్న వాడు 
యజ్ఞశేషములను పొందువాడు 
రసానుభవములు అందినవాడు 
అందమైనవృత్తిగలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
505)సోమః -

చంద్రరూపంలో నున్నవాడు 
ఓషధులను అందించువాడు 
పితృదేవతా సమానుడైనవాడు 
వాయురూపమున చరించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు