శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
591)గోహితః -

భూమికి హితకరమైనవాడు 
చంద్రప్రకాశమునిచ్చువాడు 
వాక్కునందు హితమైనవాడు 
గోహితకారణమైనట్టి వాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
592)గోపతిః -

భూదేవికి భర్తగానున్నట్టివాడు 
భూచరములను కాచుచున్నవాడు 
ఇంద్రునివలే పాలించగలవాడు 
జీవరాశికి రాజైనట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
593)గోప్తా -

జగత్తును రక్షించుచున్నవాడు 
సూర్యకిరణములవంటివాడు 
విశ్వమును కాచుచున్నట్టివాడు 
గోపాలకునివలే యున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
594)వృషభాక్షః -

ధర్మదృష్టిని కలిగినవాడు 
నందీశ్వరుని కన్నులున్నవాడు 
వృషభాక్షః నామమున్నట్టివాడు 
ధర్మదృష్టిని కలిగించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
595)వృష ప్రియః -

ధర్మముకు ప్రియమైనట్టివాడు 
వృషాధిపతిగా పేరున్నవాడు 
సమన్యాయము చేయుచున్నవాడు 
ధర్మమును పాటింపజేయువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు