సుప్రభాత కవిత -బృంద
ప్రభాతవేళ ప్రకాశించే
ప్రసూనాల మెరుపులు
ప్రభాకరుని రాక కు పట్టే
నీరాజనాల వెలుగులు

ప్రత్యూషాన రవి రాకను సూచిస్తూ
నింగిని ఒలికే రంగులకు
ధీటుగా ఉద్యానమున విరిసే 
పూల రంగుల అతిశయం

గగనాన అలరారు
పాలపుంత మెరుపుకు
భువనాన విరిసే ఈ
పూలపుంతకు పోటీ

నీలి నింగి విస్తుపోతూ
చూసెనంట.... పాపం
రేయిలో తారల వలె  
మెరుస్తున్న పూలకాంతి

తారల వలె శాశ్వతం 
కాకపోయినా ....
అదే మెరుపూ..అదే అందం
అందమైన అరవిందాల సొంతం

తూరుపు వాకిలి తెరవకనే
వేవేల వర్ణాల సోయగాలతో
అరవిచ్చిన రేకుల కనులతో
ఆప్త మిత్రుని ఆగమనానికై

వేచి.....పరిమళాలు పంచి
పండుగలా పుడమిని మార్చి
నిండుమనసునే నీరాజనమిచ్చి
దినకరుని స్వాగతించు

సుమ సమూహానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు