ఈర్ష్య వలదు-: గంగాధర్ కొల్లేపర
*కుసుమ ధర్మన్న కళాపీఠం *
=====================
నిండు పున్నమినాడు అంబరాన
చొచ్చుకొచ్చాడు రేరాజు నిశిని చీల్చుకుంటూ 
తళ్ళుక్కుమని మెరిసే తారా పరివారం తోడుగా...

వెన్నెల సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు 
వెండికొండమీద స్థితమై వన్నెలీనుతున్న చంద్రుడు 
ధరణిపై అలరారే మర్త్యుని మదిలో  ఓలలాడేను 
ప్రకృతి *అందమే ఆనందం*గా...

వెన్నెల వెలుగుల స్పర్శకు ఉప్పొంగిన సంద్రుడు 
పోటెత్తిన అలల జోరు తాకిడి 
తీరపు అంతరంగాన ఉప్పొంగేను ఆనందపు సడి
వన్నెలీనెను *రసమయ జీవిత*పు ఝడి...

అందని ద్రాక్షకోసం అర్రులు చాచకు 
అత్యాశకు మెట్టెలు కట్టి కొరివితో తలగోక్కోకు 
రమణీయ కాలాకూట విషమై 
నందనవనాన్ని ఎడారిగా మార్చేను...

పెద్దలమాట సద్దిమూట 
పెడచెవిన పెట్టకు ఎన్నడూ వారి మాట 
జన్మకు సార్ధకత కూర్చేను 
వారు చూపిన చూపిన మార్గంలో పయనం...
మది కుంభాన ఆనందం అమృతమై నిండదా 
భావి జీవితం అమృతతుల్యమై సాగదా..

కామెంట్‌లు