పున్నమిరోజు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
సూర్యుడు
అస్తమిస్తున్నాడు
చంద్రుడు
ఉదయిస్తున్నాడు

రవి
అరుణకిరణాలుచల్లుతున్నాడు
శశి
ధవళకాంతులుచిమ్ముతున్నాడు

పగలు
పరుగెత్తుతుంది
వెన్నెల
వెంటబడుతుంది

అందం
ఆకాశాన్ని ఆవరించింది
ఆనందం
అంతరంగాలను చేరింది

జాబిలి
నింగిలో నిండుగాకనిపిస్తున్నాడు
వెన్నెలని
నేలమీద పిండిలాపరుస్తున్నాడు

మబ్బులు
చంద్రుడితో ఆడుకుంటున్నాయి
మదులు
కాంచి మురిసిపోతున్నాయి

ఆత్రేయుడు
పరుగెడుతున్నాడు
అకల్క
వెంటపడుతుంది

కలువలు
విచ్చుకుంటున్నాయి
చెరువులు
సంబరపరుస్తున్నాయి

తారలు
తళతళలాడుతున్నాయి
మోములు
ధగధగామెరుస్తున్నాయి

కారుమబ్బులు
తేలుతున్నాయి
కలాలు
కదులుతున్నాయి

ఊహలు
ఊరుతున్నాయి
భావాలు
బయటపడుతున్నాయి

కలాలు
కక్కుతున్నాయి
కాగితాలు
నిండుతున్నాయి

కవులు
కష్టపడుతున్నారు
కవితలు
పుట్టకొస్తున్నాయి

అందాలు
అలరిస్తున్నాయి
ఆనందాలు
అందుతున్నాయి

పున్నమి
పులకరిస్తుంది
కౌముది
కుతూహలపరుస్తుంది


కామెంట్‌లు