గృహారంభం;-:డా.రామక కృష్ణమూర్తి
 ఇటుక మీద ఇటుక పేర్చి,
స్వేదమే సిమెంటుగా చేర్చి,
ఇంతింత,అంతింత అంటూ,
అందమైన పక్కా ప్రణాళికతో,
రూపుదిద్దుకుంది గృహం.
ఎన్నో ఆశల,ఆశయాల కలయికలతో నిలబడింది.
పెద్దల ఆశీర్వచనాలు,
పండితుల ముహూర్తాలతో,
ప్రారంభానికి సిద్ధమైంది.
మంగళవాయిద్యాలతో,
గోమాత నడయాడిన రోజు,
వాస్తుపూజ,హోమాలతో,
ఆడబిడ్డలు నీళ్ళబిందెలతో
ప్రవేశిస్తుండగా,
దిష్టితీసిన ఆచారాలతో,
బలిఅన్నపు అమరికలతో,
పాలుపొంగిన శుభవేళ,
సత్యనారాయణ వ్రతంతో 
పరిసమాప్తి క్రతువు.
విందుభోజనాలు,శుభాకాంక్షలు
పేరంటాలతో మర్యాదలు.
గృహప్రవేశమే జీవితాన ముఖ్యఘట్టమై నిలిచిపోతుంది.
కామెంట్‌లు