'హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 85.
చంపకమాల.
విభవము తోడ రక్కసులు భీకర యుద్ధము జేయ దేవతల్ 
క్షుభితమునొంది పాఱుచును జొచ్చగ నీదరి రక్షకోరుచున్ 
ప్రభువుగ వచ్చితీవు ధరఁ బాపుల పీడ తొలంగ నుద్ధతిన్ 
శుభములు కల్గగన్ గొలుతు శోకవిదూర!ముకుంద!శ్రీహరీ!//

86.
చంపకమాల.
అణువున సూక్ష్మమై చెలగి యానభ మందున విశ్వరూపిగన్
గుణరహితుండవై వెలిగి కోటి దినేశుల మించిపోవ నిన్
గనుగొన లేక మౌనితతి కానల కేగి తపంబు జేయ నీ
ఘనతను తెల్పగన్ దరమ ? కంజభవాత్మజుకైన శ్రీహరీ!//
;

కామెంట్‌లు