సుప్రభాత కవిత ; - బృంద
ఏటి మనసున దాగి ఉన్న
కోటి ఆశలు ఏమిటో
చాటి చెప్పగ వేచి ఉన్న
మాటలేవో? ఏమిటో?

నీటి లోపలి పొరల 
మాటున దాచి వుంచిన
మమత నిండిన గుండెలోని
మణులేవో! ఏమిటో!

నీలినింగిని సాగుతున్న
పాల మబ్బుల పొంచిన
చినుకు.. కురిసి నేలను కలిసే
క్షణం ఎపుడో !ఏమిటో!

వాగులన్నీ జారిపోతూ
కడలింటికి చేరుకోవాలనే
వడిని చూసి శిఖరాల తలపులోని
భావాలెన్నో! ఏమిటో?

నీటిలో తమ నీడ చూసి
ఇంత సొగసా  నాకు అని
మురిసిపోయే తరువుల
అతిశయాలెందుకో! ఏవిటో!

రోజు దాటిపోతే చాలు
గమ్యానికి దగ్గరవుతున్నానని
ఉత్సాహంతో అడుగులేసే
మనసులోని తొందరలెన్నో! ఏమిటో!

కోటి కలతలను గోటి మీటుతో
దూరం చేసే తాయిలమేదో తెచ్చి
వెతలు దూరం చేయాలని వచ్చే
వేకువ ఎవరికేమిచ్చేనో! ఏమిటో!

మనసు ముంగిట 
కలల ముగ్గులు వేసి
రెప్పల తలుపులు తీసి వేచిన 
మదిని వెదికి దరిచేరే 

వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు