కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 హిందూ సంప్రదాయంలో భోజన నియమాలు ఏమిటో బిడ్డలకు చిన్నతనంలోనే   నేర్పడం తల్లి బాధ్యత వడ్డన పూర్తయిన తర్వాత  లేదా కంచంలో ఆవు నెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది  ఉపాసకులను ఏదైనా దీక్షలో ఉన్న వారిని తక్కువ తినమని బలవంతు పెట్టరాదు  భోజనం చేస్తున్నప్పుడు నీళ్ల పాత్రను కుడివైపు ఉంచుకోవాలి ఎంగిలి విస్తరాకులను తీసేటప్పుడు  ఆ తీసేవారికి వచ్చే పుణ్యఫలం అన్నదాతకు కూడా రాదని శాస్త్రం  భోజనం అయిన తర్వాత రెండు చేతులు తప్పకుండా కడుక్కోవాలి నోటిని నీటితో పుక్కిలించుకోవాలి  భోజనం అయిపోయిన తర్వాత  చిన్నచోట శుభ్రం చేసి మాత్రమే అక్కడ వేరే వారికి భోజనం వడ్డించాలి  ఒకసారి వాడిన ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తినకూడదు  స్త్రీలు గాజులు ధరించకుండా భోజనం  చేయరాదు వడ్డించరాదు అని మన పెద్దలు చెప్తారు. చాలామంది వైద్యులు కూడా చక్కెర వ్యాధితో బాధపడేవారు దుంప కూరలు తినకూడదు అని నిషేధిస్తారు  చామ దుంప కూర ఎంత రుచిగా ఉంటుందో దానిలో ఎన్ని పోషక పదార్థాలు ఉన్నాయో తెలియక మాట్లాడే మాట  చామకూర వెంకట కవి  గారు విజయ విలాసాన్ని గురించి అర్జునుడు చేసిన  పనులన్నీటిని తెలియజేస్తూ ముగ్గురు భార్యలను ఎలా  వివాహమాడాదో చెప్పడంలో  సిద్ధహస్తుడు వెంకట కవి  ఆ గ్రంథం చదివిన  విమర్శకులు కూడా చామకూర పాకానపడింది అని పొగిడారు.
ఇంటిని చూడు ఇల్లాలిని చూడు అని ఒక సామెత  ఆ ఇంటి ఇల్లాలు  ఆ గృహాన్ని  ఎంత అందంగా తీర్చిదిద్దుతుందో దాన్ని బట్టి ఆమె  పద్ధతిని అంచనా వేయవచ్చు  ఆరోగ్య విషయంలో కానీ  పరిసరాల  పరిశుభ్రత గాని  ఆహారాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఏమి తినాలి ఎలా తినాలి అన్న విషయాలను కానీ  ఆమె సమగ్రంగా నేర్చుకుని ఉంటుంది అని అందరికీ తెలుస్తుంది  మనం తినే ఆహారంలో కూర లేకుండా అన్నం ఉండదు  ఆ కోరలు చేసుకునేటప్పుడు ఏ కూర తర్వాత ఏ కూర ఏ పచ్చడి తర్వాత  ఏ పచ్చడి వాడాలో ఆమెకు తెలిసినట్టుగా ఆ ఇంట్లో ఎవరికీ తెలియదు  ఇంట్లో ఉన్న గృహస్తు కూడా  ఆమెకు కావలసిన వనరులను ఏర్పాటు చేయడం తప్ప  మిగిలిన విషయాలు ఆయనకు కూడా తెలియవు.

కామెంట్‌లు