మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 దర్శన కాలంలో యాత్రికులు లోపల డబ్బులు వేయాలి అనుకుంటే  తండు వద్ద కుల శేఖర పడి అనే వెండి గడప మీద మొహరులతో బీగము కలిగి పై మూత మీద రూపాయి పట్టుటకు మాత్రము రంధ్రము కలిగి ఉన్న చిన్న పెట్టెలో వేయాలి.అక్కడ   పహారా ఉంటుంది ఎవరి చేతికిని సొమ్ము ఇవ్వకూడదు లోపల ధర్మార్థం ఎవరికి ఏది  యు ఇవ్వకూడదు  ధర్మ దర్శన కాలంలో ఒక్కొక తడవకు కొంతమంది దర్శనానికి వదులుతూ ఉన్నప్పుడు మగవారిని  వేరుగాను ఆడవారిని వేరుగాను  వదిలి దర్శనము చేయుటకు సమ్మతించరు. ఇదే మాదిరి ఇతరులను అభిప్రాయపడి ఆడవాళ్ళను వదిలి వెళ్ళరు అనే సంగతి    గ్రాహ్యము  ఎందుకో ఒక  ఉదాహరణ చెప్తాను  రైడిలో ఆడవాళ్లకు ప్రత్యేక ఒక బండి ఉన్నా అక్కడ కూర్చుండదు   అనేకులు తమ ఆడవాళ్ళను తమతో కూర్చుండబెట్టుట  చూడలేదా కావున ఇది  జరుపుట యాత్రికులను కష్టపెట్టుట అని  తెలుసుకోవాలి అది నాకు కూడా కొన్ని వేళల్లో ఇది జరపబడుతుంది. ఈ దర్శనము అయిన తరువాత శుద్ధి చేస్తాడు శుద్ధి అంటే శుభ్రపరచడం దీనికి   అరగంట సమయం తీసుకుంటుంది  ఈ సమయంలో పాత్రలు నట్టిలు బాగా శుద్ధి చేసి ముందు జరగబోవు సేవకు పాత్రలలో ఆకాశగంగ తీర్థము నింపి పనిచేస్తూ ఉంటారు ఈ సమయంలో లోపల పని చేసే సేవకుడు తప్ప ఇతరులు ఎవరు వెళ్ళకూడదు  తోమాల సేవ ఇది శుద్ధి అయిన వెంటనే ఆరంభమవుతుంది ఇది శ్రీవారికి ఆరాధనై  పుష్పమాలలు సమర్పించే సమయం  ఈ సేవ చేయించి వారు దేవస్థానము  పారుపత్యదార్ వద్ద 18 రూపాయలు చెల్లించి ఒక టికెట్ తీసుకోవాలి టికెట్ ఒకటికి ఐదుగురిని  పంపుతారు  అంతకుమించి వదలరు  శ్రీవారి బ్రహ్మోత్సవము నవరాత్రి ఉత్సవాలలో మాత్రం నలుగురు వంతున వదులుతారు  అంతేకాక  వసంతోత్సవములో బ్రహ్మోత్సవము జరిపించుటకు  రూపాయలు చెల్లించిన వారిని సాధారణ  రోజులలో 10 మంది మొదలు  తరగతి వారి బ్రహ్మోత్సవాన్ని బట్టి  పంపిస్తూ ఉంటారు. ఇలా సొమ్ము చెల్లించిన వారందరూ సేవా ఆరంభం నుంచి తుది వరకు  ఉండవలసి వస్తుంది  శ్రీ స్వామి వరుల నిజపాద దర్శన ప్రాప్తి కలుగుతుంది శ్రీవారికి ఆరాధనలో హోమాలచే అలంకరిస్తాడు ఈ సేవలో వేద పారాయణము ద్రవిడ పారాయణము జరుగుతుంది ఈ కాలంలో గద్వాల్ రాజు గారి నేతి దివిటీలు ఎదుగుతూ ఉంటాయి హత్తి రాంజీ మఠం యొక్క మైసూర్ సంస్థానం  యొక్క మనుషులు చామలకైకర్యము చేస్తూ ఉంటారు సేవ పూర్తయిన తర్వాత దేవస్థానపు హారతి ఒకటి అయిన తర్వాత గృహస్థుల హారతికి పెట్టకు హారతి చేస్తారు వెంటనే యాత్రికుడు  బయటకు వచ్చేయాలి  శ్రీవారి ఆలయంలో ప్రాంతః కాలంలో మోగించే మంగళవాద్యాన్ని హరికొలువు అని పిలుస్తారు  ఈ హరి కొలువు అన్న పదానికి ఇతర దర్పారు అని అర్థం కూడా ఉంది.కామెంట్‌లు