పరోపకారులు ప్రపంచంలో;- -గద్వాల సోమన్న,9966414580
మల్లెలకేమో పూయుట ఇష్టం
పల్లెలకేమో పెట్టుట ఇష్టం
పరోపకారులు ప్రపంచంలో
పిల్లలకేమో ఆడుట ఇష్టం

కోయిలకేమో పాడుట ఇష్టం
నెమలికేమో నాట్యము ఇష్టం
పరోపకారులు ప్రపంచంలో
పావురంకేమో ఎగురుట ఇష్టం

యేరులకేమో పారుట ఇష్టం
తరువులకేమో పంచుట ఇష్టం
పరోపకారులు ప్రపంచంలో
గురువులకేమో బోధన ఇష్టం

చుక్కలకేమో వెలుగుట ఇష్టం
మొక్కలకేమో ఎదుగుట ఇష్టం
పరోపకారులు ప్రపంచంలో
కుక్కలకేమో మొరుగుట ఇష్టం

నవ్వులకేమో పెదవులు ఇష్టం
దివ్వెలకేమో వెలుగులు ఇష్టం
పరోపకారులు ప్రపంచంలో
పువ్వులకేమో సేవలు ఇష్టం

భానునికేమో పొడుచుట ఇష్టం
బాలలకేమో స్నేహం ఇష్టం
పరోపకారులు ప్రపంచంలో
మొయిలలకేమో కురియుటఇష్టం
 
పొలాలకేమో పండుట ఇష్టం
గళాలకేమో గానం ఇష్టం
పరోపకారులు ప్రపంచంలో
కవులకేమో కలాలు ఇష్టం

రైతలకేమో పొలాలు ఇష్టం
జీవులకేమో జలాలు ఇష్టం
పరోపకారులు ప్రపంచంలో
తల్లులకేమో పిల్లలు ఇష్టం


కామెంట్‌లు