అక్షర ప్రబోధం;--గద్వాల సోమన్న,9966414580
లోకమే నవ్వినా
శోకమే క్రమ్మిన్నా
ధైర్యాన్ని వీడకు
లక్ష్యాన్ని మరవకు

ఎగతాళి చేసినా
దుమ్మెత్తి పోసినా
వెనుకంజ వేయకు
నిర్లక్ష్యం చేయకు

పగవారు వచ్చినా
కష్టాలు తెచ్చినా
ఏమాత్రం జడియకు
వెనుతిరిగి చూడకు

అపనిందలు వేసినా
అవమానమెదురైనా
నెమ్మదిని కోల్పోకు
నిరాశ దరి చేరకు

కత్తులే దూసినా
నిర్దయను చూపినా
ఆందోళన చెందకు
ఆశలు వదలుకోకు

ఇడుములు దండెత్తినా
ఓటమి పోటెత్తినా
ప్రయత్నాలు మానకు
ప్రక్కకు వైదొలగకు


కామెంట్‌లు