భాన్గఢ్ కోట! సేకరణ... అచ్యుతుని రాజ్యశ్రీ

 కొన్ని విషయాలు చదివినా నమ్మబుద్ధి కాదు.కానీ మనదేశంలోనే కాదు విదేశాల్లో కూడా దెయ్యాలు ప్రేతాత్మలున్నాయని నమ్ముతారు అక్కడి జనాలు.ఇక మనదేశంలో రాజస్థాన్ ఈఅలౌకిక కన్పడని శక్తులకి కేంద్రం అని చాలా మంది అంటారు.భాన్ గఢ్ ఫోర్ట్ అలాంటిది.అల్వర్ జిల్లా ఆరావళీ కొండలపై సరిస్కా అభయారణ్యం సరిహద్దు లో ఉంది ఈకోట. చూస్తూనే భయం దడపుట్టిస్తుందిట. రాత్రి పూట భయంకరమైన అరుపులు కేకలు విన్పడ్తాయిట ఇప్పటికీ.రాత్రిపూట ఇక్కడ కి ఎవరినీ అనుమతించరు.పురాతత్వశాఖ కూడా నిబంధన విధించింది.రాకుమారి రత్నావళి ప్రేమ లో పడిన ఓతాంత్రికుడు ఆమెను వశపర్చుకునే ప్రయత్నం చేశాడు.అతని కుట్ర బైటపడటంతో చంపేశారు.తాంత్రికుని శాపం కారణంగా ఈకోట శిథిలమైందిట! ఇంకో కథనం ఏమంటే కోట నీడ పల్లెలోని ఒక తపస్వి ఇంటిపై పడటంతో శపించాడు అని అలా కోట సర్వనాశనం ఐందని కథనం.భాన్ గఢ్ కోట నిఉదయం 6 నుంచి‌
 సాయంత్రం 6 లోపలే తిరిగి బైటికి వచ్చేయాలి.ఒకవేళ మొండి కేసి ఎవరన్నా ఉంటే తెల్లారి కన్పడడు. గల్లంతు అవుతాడు.ఈకోట జైపూర్ ఢిల్లీ మధ్య ఉంది.🌸
కామెంట్‌లు