శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
726)నైకః -

వివిధ రూపాలలోనున్నవాడు 
తెలియవచ్చుచున్నట్టి వాడు 
త్రిత్వాత్ముడై నిలిచినవాడు 
ఉనికిని చాటుకొనుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
727)సవః -

సోమయాగము రూపున్నవాడు 
ఏకానేక ప్రతిబింబసహితుడు 
ఋజువుగా నిలిచినట్టి వాడు 
సవము యైన పూర్ణపురుషుడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
728)కః -

సుఖ స్వరూపము గలిగినవాడు 
బ్రహ్మానందస్థితిలోయున్నవాడు 
పూర్ణత్వము కలిగినవాడు 
నిశ్చలభావన నిండినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా
729) కిమ్ -

అతడెవరని అడగగలవాడు 
విచారణ చేయదగినట్టి వాడు 
ఎరుకజేయ దగినట్టివాడు 
ప్రశ్నించేవిధంగా యున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
730)యత్ -

దేనినుండి విశ్వమున్నదో వాడు 
సర్వత్రా వ్యాపించియున్నవాడు 
ఆ భావనను కలిగించువాడు 
ఆంతర్యము అయినట్టివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు