సుప్రభాత కవిత ; -బృంద
రాబోవు రేపు కోసం
రాత్రి నుండీ ఎదురుచూపులు
కలవబోవు వెలుగుల
మైత్రికోసం పడిగాపులు

వేగుచుక్క పొడిచిన వెంటనే
ముక్కలైన చిక్కని చీకటి
చక్కనైన వెలుతురు కోసం
తూరుపు వైపే జగతి చూపులు

విహంగాల రెక్కల చప్పుడు
కుహుమన్న కోయిల పిలుపులు
పరుగులు తీసే పవనాలు
ఉరకలు వేసే ఉత్సాహాలు..

ప్రశాంతమైన ప్రమోదానికి
నిశ్శబ్ద కిరణ విస్ఫోటనానికి
వెలుగులతో నిండి విరిసే
నీలి నింగి కట్టిన అరుణాంబరాలు

ఊయలలో బోసిగ నవ్వే
పసిపాపాయి ముద్దుమొహంలా
అమాయకంగా ఊయలూగే
పొలంలోని పచ్చని పైరు

కలల కిరీటపు ధగ ధగలతో
ఇలకు వస్తున్న ఇనుడిని చూసి
కలకల విరిసే జగాలన్నీ
గలగలా నవ్వుతూ స్వాగతించే

వేచిన వేకువకు

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు