'హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి. పూణే. మహారాష్ట్ర.
 101.
చంపక మాల.                  
ఘడియలు జాములున్ గడచి కాలము పర్వులు పెట్టు చుండగా 
పడితి నశాశ్వతంబగు భవాంబుధి యందు విమూఢ చిత్తనై 
కడకిటు నీదు పాదములు గట్టిగ పట్టితి నుద్ధరింపుమా!
విడువకు మయ్య!నన్ను కురి పించవె నీదుకృపా సుధన్  హరీ!//
 102.
చంపక మాల.
జవమున జీవ మంతయును జాఱెను చేతన లేమిఁ దీనతన్ 
ఠవఠవ నొందగన్ తనువు డస్సెను యోపిక లేక గ్రుంగితిన్ 
జివరకు నిన్ను గొల్చుటకు చేవగు డార్ధ్యము లేక బోయెరా !
భవహర !నిన్ను దల్చుకొని భావన జేసెద నమ్మికన్ హరీ !//
103.
చంపక మాల.
 వినికిడి తగ్గె దేహమున వేసట కల్గి కఫంబు జేరఁగన్ 
కనులను శుక్ల ముల్ పొడమ కాంచగ నైతిని వెల్గులన్ ప్రభూ!
మునిగితి బాధలన్ మదిని పూర్వ దినంబుల దల్చి క్రుంగితిఁన్ 
దినదిన ముల్ చరింపగను దీనత నొందితి కావుమా హరీ !//


కామెంట్‌లు