శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
676)మహాయజ్వా -

విశ్వ శ్రేయోభిలాషగలవాడు 
యజ్ఞనిర్వహణ చేయుచున్నవాడు 
యాజకులలో ఉత్తముడైనవాడు 
వేదములు ఉద్ధరించుచున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
677)మహా యజ్ఞ-

గొప్పక్రతువులు చేయుచున్నవాడు 
సదా హోమములు జరుపువాడు 
వేదోపకరమై అగ్నియైనవాడు 
సమిధలను వ్రేల్చుచున్నట్టివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
678)మహాహవిః -

యజ్ఞములో హవిస్సులందువాడు 
యజ్ఞసాధనములు తానైనవాడు 
హోమద్రవ్యములు ఇచ్చుచున్నవాడు 
మహా హవి నామమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
679)స్తవ్య -

సర్వులలో స్తుతింపబడువాడు 
భక్తులతో నుతులందుకొనువాడు 
అహర్నిశలు భజింపబడువాడు 
స్తవములు రచించబడువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
680)స్తవప్రియః -

స్తోత్రప్రియుడు అయినట్టివాడు 
ప్రార్థనలకు పరవశించువాడు 
భక్తులసేవలో సదాయున్నవాడు 
స్తుతులకు ప్రీతికలుగువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు