ఆణిముత్యాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 పతంజలి చేసిన వ్యాఖ్యలకి మాత్రమే మహాభాష్యం అని పేరు.వెయ్యినోళ్లున్న‌ఆదిశేషువే  పతంజలి గా జన్మించి పాణిని సూత్రాలకి మహాభాష్యం రాశాడు.
ఇక ఎప్పుడూ నిశబ్దంగా ఉండే రమణమహర్షి పెద్ద వయసు లో కాళ్ళు ముడుచుకొని కూర్చోలేక  చాపి కూచున్నారు.ఆయన్ని దర్శించటానికి వచ్చిన విదేశీయులు అలా కూర్చోవాలి కాబోలు అనుకుని రమణుని ఎదురుగా కాళ్ళు బారజాపి కూచున్నారు.ఒక శిష్యుడు వచ్చి అలా కూర్చోరాదు అని హెచ్చరించాడు విదేశీ భక్తులను.వెంటనే రమణులు అతికష్టంమీద కాళ్ళు ముడుచుకొని " పాపం వారి కి ఏం తెలుసు?/ నేను గురుస్థానంలో ఉండి అలా కూచున్నా ను.ముందు నేను ఆదర్శం గా ఉదాహరణ గా నిలవాలి" అన్నారు.మనం అవతలివారికి ఏదైనా చెప్పేముందు మనం ఆచరించాలి.ఇంటా బైట పెద్దలు పిల్లలకి మార్గదర్శిగా ఉండాలి.
వైరాగ్యం అంటే ఏమిటి అని శిష్యులు గురువు ని ప్రశ్నించారు.నది సుఖం దుఃఖం వచ్చినా పట్టించుకోకుండా అలా పారుతూ పోతుంది. కష్టం కి కుంగి సుఖానికి విర్రవీగకు అని తెలిసి ఆచరణలో పెడితే అదే వైరాగ్యం అని గురువు చెప్పిన జవాబు🌷
కామెంట్‌లు