తెలుసుకుందాం! అచ్యుతుని రాజ్యశ్రీ
 మనం జాజికాయ జాపత్రి ఎక్కువగా వాడం.కానీ ఇప్పుడు కేరళలో రైతులకి కనకవర్షం కురిపిస్తోంది జాజికాయ.తమిళనాడు రైతులకు కూడా లాభం చేకూరుతోంది.కేరళ తమిళనాడు కి సమీపం లో ఉన్న పొలాచీ కొబ్బరి కాయలకు ప్రసిద్ధి. జాజికాయ ను గరంమసాలా లో వాడతారు.ఆంగ్లేయులద్వారా మన దేశంలో ప్రవేశించింది.200మంది రైతులు  500ఎకరాల్లో దీన్ని పండిస్తున్నారు. 80 మంది రైతులు కల్సి సమూహం గా ఏర్పడి జాపత్రి జాజికాయ పంటలతో  కె.జి.2వేలదాకా 
 పొందుతున్నారు.5 శాతం జి.ఎస్.టి.పోయినా 25 శాతం లాభం వస్తోందిట.
ఇక జామపండు కూడా ఖరీదైపోయింది.బీదల యాపిల్ అని పేరు.ఇందులో వెరైటీలు లలిత్ అనే జామలోపల గులాబీ రంగు లో రుచి రంగు తో అందం ఆరోగ్యం.శ్వేతా జామ పండాక లేత పసుపు లో ఉంటుంది.లేత ఎరుపురంగు జామ కూడా ఆరోగ్యం కి మంచిది.మన పెరట్లో వాకిలి ముందు గింజలు చల్లితే త్వరగా మొలుస్తుంది.ఆకులు నమిలితే దంతాలు చిగుళ్ళు గట్టిపడతాయి 🍏

కామెంట్‌లు