సాహితీసంద్రం- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అలల్లా
ఆలోచనలు
ఆవిర్భవిస్తున్నాయి

బడబాగ్నిలా
భావాలు
భగభగలాడుతున్నాయి

చినుకుల్లా
అక్షరాలు
కురుస్తున్నాయి

పైరగాలిలా
పదాలు
ప్రసరించుతున్నాయి

పాలుచిలికినట్లుగా
మనోమదనము
సాగుతుంది

వెన్నలా
కవిత్వము
పుట్టకొస్తుంది

జలచరాల్లా
కవులు
ఈదుతున్నారు

రత్నాల్లా
కవితలను
వెలువరించుతున్నారు

సముద్రాన్నిచూచి
సాహిత్యాన్నిచదివి
సంతసపడండి

కవులవ్రాతలుపఠించి
కవనలోతులుపరికించి
కుతూహలపడండి


కామెంట్‌లు