అక్కా చెల్లి ఆటలు;- ఎడ్ల లక్ష్మి
అక్కా చెల్లి వచ్చారు
చెమ్మచెక్కలాడారు
చెమ్మగిల్లిపోయారు
పిల్లలొచ్చి చూసారు!!

నీళ్లు చల్లి లేపారు
పందిరికిందికి చేర్చారు
బిందు నేమో పిలిచారు
చిందులేసి ఎగిరారు!!

నందు సింధు వచ్చారు
సందులన్నీ తిరిగారు
పిల్లల వద్దకు చేరారు
పల్లి పట్టీలు పంచారు!!

పల్లి పట్టీలు తిన్నారు
పరుగులు తీసి ఉరికారు
ఆటలు ఎన్నో ఆడారు
అమ్మ ఒడికి చేరారు !!


కామెంట్‌లు