దేవుడుప్పులపుట్టినవూరే దేవరుప్పులగమారే;- అంకాల సోమయ్యదేవరుప్పుల జనగాం9640748497
పల్లవి;
ఉప్పులపుట్టెనుదేవుడు
ఉప్పుల మల్లన్న 
దేవుడుప్పులపుట్టినవూరే
దేవరుప్పులగమారే----2
1)చరణం
కొలిచే వారికి కొంగు బంగారమై
నిలిచెను ఉప్పులమల్లన్న ---2
తలిచేవారికితానున్నానని
అభయమిచ్చునుమల్లన్న---2
/ఉప్పుల/
2)చరణం
గొడ్డుగోదాపాడిపంటలను
కాచేతండ్రీమల్లన్న---2
పిల్లాపాపలచల్లగజూచే
పిలిచినపలికేమల్లన్న---2
3)చరణం 
/ఉప్పు/
ఏటేటా చేసేము కళ్యాణం 
ఉప్పులమల్లన్నకళ్యాణం 2
ఆదిదంపతులకళ్యాణం
లోకరక్షణకుయిదిమూలం2
/ఉప్పు/కామెంట్‌లు