సుప్రభాత కవిత ; - బృంద
పోగొట్టుకున్న అనుభూతులెన్నో!
తట్టుకున్న కష్టాలెన్నో!

కట్టుకున్న ఊహలమేడలెన్నో!
చుట్టుకున్న వెతల ముడులెన్నో!

దాచిపెట్టుకున్న ఆకాంక్షలెన్నో!
దోచు కోబడ్డ సంతోషాలెన్నో!

కోట కట్టిన నిరాశలెన్నో?
మూట కట్టుకున్న వేదనలెన్నో?

జారవిడుచుకున్న మధురక్షణాలెన్నో?
పారేసుకున్న బ్రతుకు తెరువులెన్నో!

పాతరేసిన కష్టాలెన్నో!
కడుపుకోతకు గురైన ప్రాణాలెన్నో!

అన్నిటికీ ఔషధంలా
ఆశించిన అమృతంలా
అలుపులేక వేచిన ఆవేదనకు
అమరమైన సంతోషాన్నిస్తూ

ఆగమించిన అరుణోదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు