;కవితారూపాలు;-రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

ఓ కవిత్వమా
నీ రూపాలెన్నో
నీ అంశాలెన్నో
నీ స్మృతులెన్నో

ఒకసారి
అందంగా దోచుకుంటావు
మరోసారి
ఆనందంగా తోచుతుంటావు

ఒకసారి
ఆలోచనగా అవతరిస్తావు
మరోసారి
భావంగా బయటకొస్తావు

ఒకసారి
అమృతాన్ని చిమ్ముతావు
మరోసారి
తేనెచుక్కలు చల్లుతావు

ఒకసారి
పద్యంగా వెలువడుతావు
మరోసారి
వచనగా వేషమెత్తుతావు

ఒకసారి
పాటగా అలరిస్తావు
మరోసారి
గేయంగా మురిపిస్తావు

ఒకసారి
పువ్వులా ముందుకొస్తావు
మరోసారి
పరిమళంలా వ్యాపిస్తావు

ఒకసారి
రవిలా ఉదయిస్తావు
మరోసారి
శశిలా పొడుచుకొస్తావు

ఒకసారి
నదిలా ప్రవహిస్తావు
మరోసారి
కడలికెరటంలా ఎగిసిపడతావు

ఒకసారి
ప్రేమజల్లుల్లో ముంచుతావు
మరోసారి
వానచినుకుల్లో తడుపుతావు

ఒకసారి
గాలిలా తాకుతావు
మరోసారి
నిప్పులా కాలుస్తావు

ఓ కవిత్వమా
నీ మహిమలెన్నో
నీ ప్రేరణలెన్నో
నీ ధోరణులెన్నో

కామెంట్‌లు