శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది ఎం. వి. ఉమాదేవి
836)బృహుత్ః -

మిక్కిలి పెద్దయినట్టి వాడు 
బ్రహ్మ స్వరూపమునున్నవాడు 
అంతయు వ్యాపించినవాడు 
అనంతమై ఆవరించినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
837)కృశః -

సన్ననిదేహము గలిగినవాడు 
కృశించిన శరీరమున్నవాడు 
అస్థూలముగా నుండినవాడు 
అల్పరూపమున్న శక్తిమంతుడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
838)స్థూలః -

స్థూల రూపమున్నట్టివాడు 
స్థిరముగా నిలిచియున్నవాడు 
మిక్కిలి ఈవిగలిగినవాడు 
బలమైన దేహమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
839)గుణభృత్ -

సత్వరజోత్సమో గుణములవాడు 
సర్వగుణములు సేవించువాడు 
త్రిగుణములకు ప్రభువైనవాడు 
గుణములను వంచినట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
840)నిర్గుణః -

గుణరహితునిగా యుండినవాడు 
నిశ్చలతత్వము గలిగినవాడు 
భగవంతుడయి యున్నట్టివాడు 
నిర్గుణ నామధేయమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు