నీలిమబ్బుల నీడలోనే
వానవిల్లు దాగెనేమో!
నింగి నుండీ ఇలకు
రంగుల బాణం వేసెనేమో!
హరివింటి అందాలన్నీ
అవనినంటి ఉండాలని
కరిమబ్బుల ఇల్లు వీడి
వసుధ పైకి వాలెనేమో!
చల్లని గాలులు ఝల్లున సోకి
ఘల్లు ఘల్లున సవ్వడి చేస్తూ
వయ్యారంగా వర్షపు చినుకులు
నేలను తడుపగ వచ్చెనేమో!
తాపమంత తరిగిపోగా
వేడి సెగలు ఎగిరిపోగా
జడిగ కురిసే వానలోన
పుడమి తల్లి కరిగెనేమో!
కమ్ముకున్న నీలినీడల
జాడలిక ఉండబోవని
చిక్కుముడుల కలతలన్నీ
విడిపోయి తీరునని నమ్మకమేమో!
స్వఛ్ఛమైన బ్రతుకునిచ్చే
అచ్చమైన మంచిరోజులు
అందివచ్చు శుభఘడియల
అందరికీ చేరువ చేయాలని
వేంచేయు వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి