అభినవ అభిమన్యుడు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మన్యంలో జన్మించిన మహిమాన్వితుడు
తీర్థయాత్రలోనరించిన కర్మయోగుడు
విద్యలెన్నొ నేర్చిన జ్ఞానదీప్తుడు
భరతమాత దాస్యశృంఖలాలను
తెగనేయబూనిన దేశభక్తుడు
తెల్లవారిగుండెల్లో గుబులైనిలిచి
విప్లవాన్ని నడిపిన వీర్యవంతుడు
రామరాజుగా ప్రభవించి
సీతతోడ గమియించి సీతరామరాజుగా
ఆదరణపొందిన ప్రజామాన్యుడు
తెల్లవారి కుట్రలకు బలియైన
భారత అభినవ అభిమన్యుడు
నిస్వార్థ నిష్కళంక వీర ధీర వరుడు
తెలుగుగడ్డ ముద్దుబిడ్డడు
అడవితల్లి ప్రేమపుత్రుడు
తరాలెన్నిమారినా విస్మరించదు 
ఇతనిని అఖండభారతం!!
************************************


కామెంట్‌లు