ప్రపంచ పర్యావరణ బాధ్యత అందరిది..;-.గ్రీన్ చాలెంజ్ కన్వీనర్ కోట్రిక విజయలక్ష్మి
 ప్రపంచ పర్యావరణ దినోత్సవ పురస్కరించుకొని   శ్రీరామకృష్ణ సేవా సమితి, గ్రీన్ చాలెంజ్"  ఫారెస్ట్ డిపార్ట్మెంట్  మొలక"బాలల మాస పత్రిక సంయుక్తంగా   ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఖంజా పూర్ గేట్ సమీపంలో శ్రీ శ్రీ వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలోను,  మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో మొక్కలు నాటి అవగాహన నిర్వహించారు 
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గ్రీన్ చాలెంజ్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి  మాట్లాడుతూ 
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత ప్రతి ఒక్కరూ
మొక్కలు నాటుదు వాటిని సంరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని పిలుపునిచ్చారు 
గ్రీన్ చాలెంజ్ లో భాగంగా ప్రతి సంవత్సరం మొక్కలు అందిస్తూ నాటిస్తూ  పర్యావరణ పై విద్యార్థులకు అవగాహన  కల్పిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ  రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటి  గ్లోబల్ వార్మింగ్ తగ్గిద్దామన్నారు
ఈ కార్యక్రమంలో తాండూర్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి శ్యాంసుందర్ రావు పాల్గొని మాట్లాడుతూ 
 రోజురోజుకు పెరుగుతున్న పొల్యూషన్ ని దృష్టిలో పెట్టుకొని అడవులని కాపాడుతున్నామని కొత్త మొక్కలు నాటాలని అందరు కూడా సహకరించి చెట్లను కొట్టకుండా జీవవైవిద్యాన్ని కాపాడాలని ఆయన పేర్కొన్నారు 
ఈ కార్యక్రమంలో పోగ్రామ్ కన్వీనర్ మొలక మాసపత్రిక ప్రతినిధి  KVM వెంకట్ పాల్గొని మాట్లాడుతూ 
 భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన ఆరోగ్యం ఇవ్వాలి అంటే 
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు  సేవ్ నేచర్, సేవ్ కల్చర్, సేవ్ సేవ్ వరల్డ్ , అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం "మర్రిచెట్టు"డాక్యుమెంటరీ  సినిమా దాసరి రంగా రైటర్ వేముగంటి డైరెక్షన్లో యూట్యూబ్లో తెలుగు వన్ డాట్ కం లో మర్రిచెట్టు సినిమాను వీక్షించి మరిన్ని చెట్లు నాడుదామని నో  బొకే  ఓన్లీ మొక్క అందిద్దామని వనజీవి ఇన్స్పిరేషన్తో గత 15 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నామన్నారు 
ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారి శ్యాంసుందర్ రావుశ్రీ రామకృష్ణ సేవ సమితి గౌరవాధ్యక్షులు గాజుల బసవరాజ్ రిటైర్డ్ హెచ్ఎంబిచ్చప్పబీట్ ఆఫీసర్ మల్లయ్య నర్సింలు  తెలంగాణ మైనార్టీ గురుకుల ఉపాధ్యాయ బృందం ఫాతిమా బేగం 
 పుష్పలత పద్మ ఝాన్సీ సుజాత తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు