హృదయవిదారకాలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఖాళీకడుపులు
కేకలేస్తున్నాయి
ప్రేగులు
గుడగుడమంటున్నాయి

కన్నీళ్ళు
కారుతున్నాయి
కాలువలు
కడుతున్నాయి

శరీరాలు
శ్రమిస్తున్నాయి
చెమటలు
స్రవిస్తున్నాయి

ఒళ్ళు
మండుతున్నాయి
రక్తము
మరుగుతుంది

పేదలు
ఏడుస్తున్నారు
ముక్కులు
చీదుతున్నారు

దేహాలు
అలసిపోతున్నాయి
సొంగలు
స్రవిస్తున్నాయి

హృదయాలు
కరుగుతున్నాయి
మనసులు
విలపిస్తున్నాయి

గుండెలు
బాదుకుంటున్నారు
ఆపసోపాలు
పడుతున్నారు

మదులు
రోదిస్తున్నాయి
అశ్రువులు
పారుతున్నాయి

ఇక చూస్తా
ఊరుకోలేను
రంగంలోనికి దిగకుండా
ఉండలేను

అనాధలకు
అండగానిలుస్తా
ఉద్యమాలు
ఉధృతంచేస్తా

సామ్యవాదము
కావాలంటా
సంఘసంస్కరణలు
రావాలంటా

గొంతెత్తి
నినదిస్తా
కలంపట్టి
కదులుతా

కదంకదం
కలుపుతారా
ఉద్యమానికి
ఊతమిస్తారా

సంక్షేమరాజ్యం
సాధిద్దామా
సమానత్వమును
స్థాపిద్దామా


కామెంట్‌లు