ఋషీ!;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 పోరుబందరున పుట్టినావు
భరతపౌరుల దాస్యము పోగొట్టినావు
చిరునవ్వుతో ప్రపంచాన్ని జయించావు
కొల్లాయిగట్టి కర్రచేతబట్టి
భరతజాతి నిను అనుసరించగా
వడివడిగా తడబడకా
సత్యాహింసలు ఔదలదాల్చి
సహనానికి నిలువెత్తు రూపంగా నిలిచి
కాలాతీత సిద్ధాంతాలు అనుసరించి
మారణహోమం నిలువరించావు
మితవాదము,అతివాదము,ఉగ్రవాదము
అంగీకరింపక,పరిమితవాదముతో ఒప్పించి
సాయుధ తిరుగుబాటును కాదని
సహాయనిరాకరణోద్యమముతో
స్వాతంత్ర్యసమరాన నీ ఒక్కొక్క అడుగు
తెల్లవారిఎదపై ఒక్కొక్క సమ్మెటపోటుగా చేశావు
భరతమాత దాస్యశృంఖలాలను తెగనరికి
మాతృభూమి ఋణం తీర్చుకున్న 
ఓ ఋషీ నీకు జోహార్!!!
**************************************

కామెంట్‌లు