వాయిదా వద్దు ; యామిజాల జగదీశ్
తర్వాత చూసుకోవచ్చులే
అంటూ
దేనినీ వాయిదా వేయడం 
తగదు

వాయిదా వల్ల
కాఫీ చల్లారిపోతుంది

వాయిదా వల్ల
ఆసక్తిని కోల్పోవచ్చు

వాయిదాతో
పగలు రాత్రిగా మారిపోవచ్చు

వాయిదాతో
యవ్వనం కాస్తా
ముసలితనాన్నివ్వొచ్చు

వాయిదాతో
జీవితం ముగిసిపోవచ్చు

వాయిదాతో
మీరు ఏమీ చేయనందుకు పశ్చాత్తాపం 
చెందాల్సి ఉంటుంది

అందుకే
అవకాశం వచ్చినప్పుడు....
ఉనన్నప్పుడే
చేసెయ్యాలి

జీవితంలో
మన ముందుండే 
క్షణాలు
సున్నితమైనవి  

కనుక 
మళ్లీ ఆ విధంగా రాకపోలచ్చు, రాకూడదు...

పశ్చాత్తాపాన్ని
దిగమింగడానికి 
ఒక చేదు మాత్ర కావాల్సి
ఉంటుంది

తప్పిపోయిన అవకాశాలతో మాట్లాడని మాటలతో మనస్సు బరువెక్కుతుంది

కాబట్టి, 
మనం తరువాతంటూ 
దేనినీ వాయిదా వేయకూడదు  

మన ముందు ఉన్న అవకాశాలను స్వీకరించడానికి హృదయాలు తెరిచి, చేతులు చాచి 
అవి వచ్చినప్పుడు 
సొంతం చేసుకోవాలి
సద్వినియోగం 
చేసుకోవాలి

చివరికి, మనం పశ్చాత్తాపపడతాం
మనం చేసిన పనులకు కాదు, 
మనం చేయని పనులకూ మాట్లాడని మాటలకూ నెరవేరని కలలకూ

కామెంట్‌లు
Popular posts