ఎండ లేదు వాన లేదుమంచు చలిలో గడ్డకట్టుకుపోయే కాయాలుకొండలు కోనలే నివాస భవనాలుతిండికొఱకు వెంపర్లాట లేదురుచులు మరచిన జిహ్వరాత్రి పగలు ఓకే తీరునిద్ర ఎరుగని కన్నుఎప్పుడూ డేగ చూపులేసుఖం అంటే ఆమడ దూరం!!అన్నీ మరచి తనను తాను మరచిభార్యాపిల్లలకు దూరమైకన్నతల్లిదండ్రుల కన్నుల్లో వత్తులైఏమీ ఆశించని నిస్వార్థ జీవులుశత్రువు పాలిట సింహ స్వప్నాలు!!బ్రతుకంతా దేశం కోసమేదేశం కోసమే జీవితందేశ రక్షణే ప్రధాన ధ్యేయంపగవానికి చిక్కి శరీరంగాయాల పాలైకుళ్ల బొడుస్తున్నారహస్యాన్ని కాపాడిన వైనం!!ధైర్యం వారి సొత్తుదేశ భద్రతే వారి ఎత్తుఉన్నత మహోన్నత శిఖరంభారతావని సిగపూవులు వీర సైనికులుభారతావని సిగలో కాంతులీనుతున్న కలికితురాయిలుఅభినందనీయులే..!!---------------------
.భరతమాత సిగలో కలికితురాయి;- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి9490367383
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి