పులస్యబ్రహ్మ(పురాణకథ)డా.బెల్లంకొడనాగేశ్వరరావు. తృణబిందు ఆశ్రమంలో తపస్సుచేసుకుంటున్నాడు పులస్యుడు. ఇద్దరుదేవతాస్త్రీలు ఆ ఆశ్రమంలో ప్రవేసించి ఆటపాటలతో పులస్యునికి ఆటంకం కలిగించారు.ఆగ్రహించిన పులస్యుడు కన్యలు ఈఆశ్రమంలో ప్రవేసించి తన కంటబడితే తమ కన్యత్వన్ని కోల్పోయి గర్బవతులు అవుతారు"అనిశపించి తపస్సు చేయసాగాడు. ఆవిషయంతెలియని తృణబిందువుని కుమార్తే పులస్యుని కంటబడి గర్బవతి అయింది.ఈవిషయం తెలిసిన తృణబిందువు తనకుమా ర్తెను వివాహంచేసుకోమనిపులస్యునికోరగా,అంగీకరించివివాహంచేసుకున్నాడు. అలా వారికి 'విశ్రవసువు' అనేకుమారుడు కలిగాడు.అతను విద్యావేత్త, తండ్రివలే తపోధనుడు.పెద్దవాడు అయిన తరువాత 'దేవవర్ణి'అనే ఆమెను వివాహంచేసుకున్నాడు.ఆదంపతులకు'కుబేరుడు'జన్మించాడు.'కైకసి' అనేమరోభార్యద్వారా విశ్రవునికి'రావణుడు'జన్మించాడు. రావణుడు తన తపోశక్తిచే శివుని,బ్రహ్మను మెప్పించి అనేక వరాలుపొంది. కనిపించినరాజులను జయిస్తూ గర్వంతో విర్రవీగసాగిడు.హైహయరాజైన కార్తవీర్యార్జునితో తలపడిన రావణుడు ఓడిపోయి అతని చెరసాలలో బంధీఅయ్యాడు.పులస్యునికి ఈవిషయంతెలిసి ఆయన కార్తవీర్యార్జుని వద్దకు వెళ్లాడు.సాదరంగా ఆహ్వానించి "తమరు విచ్చేసిన కార్యంఏమిటి"అన్నాడు." నాయనా నీచెరసాలలో ఉన్నరావణుడు నామనుమడు అతన్ని బంధవిముక్తుడనుచేయి"అన్నాడు పులస్యుడు. వెను వెంటనే భటులనుపిలిచి రావణుని గౌరవంగా సాగనంపాడు కార్తవీర్యార్జునుడు.


కామెంట్‌లు