బహుమతులు గల గల పారేటి వాగులు ఏరులు పచ్చగా ఉండేటి కొండలు కోనలు కిల కిల లాడేటి అందాల పక్షులు అడవిలో ఉండేటి అరుదైన జంతువులు గత కవులు వ్రాసేటి ఘనమైన గ్రంథాలు జన హితం కోరేటి ఆధునిక రచనలు అలనాటి అపురూప అందాల శిల్పాలు కనుల పండుగ జేయు బహు నృత్య తీరులు సందడులు చేసేటి పండుగలు పబ్బాలు ప్రకృతిని పూజించు మన సంప్రదాయాలు వారసత్వముగ వచ్చు ఆస్తులే ఆస్తులు భావి తరాలకు మనమిచ్చు బహుమతులు బెలగాం భీమేశ్వరరావు పార్వతీపురం


కామెంట్‌లు