సిటీకాలేజి : సుద్దాల అశోక్ తేజ కు ‘మఖ్దూం మొహియుద్దీన్ నేషనల్ అవార్డు‘ ప్రదానం బుధవారం జరిగింది. రెండు గంటలపాటు విద్యార్థుల్లోకి మఖ్దూం జ్ఞాపకాలను, కవిత్వాన్ని ప్రవహింపజేసే అవకాశం వచ్చింది. ఆయన జీవితం, అతని మార్గం, కవిత్వం, సిటీ కాలేజీతో ఆయన అనుబంధం... మళ్లీ పునశ్చరణ చేసుకునే అవకాశం ఈరోజు కుదిరింది.సుద్దాల అశోక్ తేజ పాటల గురించి, వాటి నేపథ్యం గురించి వివరణాత్మకంగా మాట్లాడారు కోయి కోటేశ్వరరావు. అద్భుతమైన ప్రసంగం. పిల్లల చప్పట్లతో గ్రేట్ హాల్ దద్దరిల్లింది. సుద్దాల అశోక్ తేజ తన అవార్డు స్పందన ప్రసంగంలో పాటలలోకి తన ప్రయాణం, తన తండ్రి సుద్దాల హనుమంతు గారి ప్రేరణ, ప్రభావం గురించి ఉద్వేగంగా మాట్లాడారు. ఈ అవార్డు అందుకోవడం తన జీవితంలో అతి ముఖ్యమైన సందర్భం అని మఖ్దూంతో తన బాల్యపు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ డా. విజయలక్ష్మి గారు, డా. Viplav Dutt శుక్లా గారు వేదికపై ఉన్నారు. ఇంకా సభలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, కొండపల్లి పవన్, Wahed Abd వంటి ప్రముఖులు పాల్గొన్నారు. మఖ్దూం గారి కుమారుడు జఫర్ మొహియుద్దీన్ గారు ఈ సభలో పాల్గొనడం సభకు అదనపు విలువ. -కవి యాకూబ్


కామెంట్‌లు