చైతన్యం ------------ ఓ అర్ధరాత్రి భార్యను, కొడుకునీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన బుద్ధుడికి కొన్నేళ్ళ తర్వాత జ్ఞానోదయమైంది. ఓరోజు బుద్ధుడు నడుచుకుంటూ పోతుండగా ఎదురుగుండా ఒకడు వస్తున్నాడు. అతనికి బుద్ధుడి ముఖంలో ఓ దివ్యమైన తేజస్సు, ప్రశాంతత కనిపించాయి. బుద్ధుడిని ఆపి "మీ ముఖంలోని ప్రశాంతత నన్ను కట్టిపడేసింది. మీరు దేవలోకం నుంచి వచ్చేరా? లేక దేవుడేనా?" అని అడిగాడతను. "నేను మీరనుకున్న రెండూ కాదు" అన్నాడు బుద్ధుడు. "మరి మీరు మంత్ర తంత్రాలు తెలిసిన ఓ అపూర్వ వ్యక్తా?" అడిగాడతను. "నాకు మంత్రాలూ తెలియవు. తంత్రాలు తెలియవు" చెప్పాడు బుద్ధుడు. "అయితే మీరు ఒట్టి మనిషేనా?" అడిగాడు అతను. "కాదు" అన్నాడు బుద్ధుడు. "మరి మీరెవరు?" అని అడిగాడు అయోమయంగా అతను. "నేను చైతన్యాన్ని" చెప్పాడు బుద్ధుడు. - యామిజాల


కామెంట్‌లు