విక్రమార్కుడు-బేతాళుడు.బేతాళకథ--.డా.బెల్లంకొండ. ఉజ్జయిని రాజ్యానికి తూర్పు దిశగా కొంతదూరంలో దట్టమైన అరణ్యం ఉంది.ఆ అరణ్యంలో ఉన్న పురాతన కాళిమాత ఆలయ సమీపంలో ఒక మాంత్రికుడు కాళికా దేవి గురించి గొప్ప తపస్సు చేసి కాళీకా దేవిని ప్రసన్నం చేసుకున్నాడు. 'అతని తపస్సుకు మెచ్చిన కాళకా దేవి వరం కోరుకో అన్నది. "మాతా ఈభూమండలానికి నేను చక్రవర్తిని కావాలి.పిశాచాలకు రాజైన బేతాళుడు నా ఆధీనంలో ఉండాలి అలా వరం అనుగ్రహించు"అన్నాడు మాంత్రికుడు. "వత్స నీకోరిక అసాధ్యం ముందుగా బేతాళుని వసపరుచుకో బేతాళుని పట్టి తీసుకు వచ్చిన వారిని నాకు సమర్పించినా లేక నీఅంతటి మంత్రశక్తులున్న వ్యక్తిని నాకు సమర్పిస్తే నీకోరిక నెరవేరుతుంది"అని చెప్పి కాళికా దేవి అదృశ్యమైయింది. తనంతటి మంత్రశక్తులు ఉన్న వ్యక్తిని దేవికి సమర్పించడం అసంభవం కనుక బేతాళుని తనవద్దకు తీసుకురా గలిగిన వీరుని మాయ దుర్బిణీలో వెదుకగా ఉజ్జయిని పాలకుడు విక్రమార్కుడు కనిపించాడు.తన పధకంలో మోదటి భాగంగా బేతాళుని పట్టి తనకు అప్పగించే పని విక్రమార్కుని ద్వారా సాధింపదలచాడు. విక్రమార్కుని రాజ సభకు విప్రుని వేషంలో వెళుతూ ప్రతిరోజు విక్రమార్కునికి అపూర్వ రత్నాలు బహుకరించి ఆశీర్వదించి మౌనంగావెళ్ళ సాగాడు. కొద్ది దినాల అనంతరం ఒకరోజున విక్రమార్కుడు "స్వామి తమరు ప్రతిరోజు ఇలా అమూల్య రత్నాలు నాకు కానుగా ఇచ్చి ఆశీర్వదించి వెళుతున్నారు నావలన తమకు నెరవేర వలసిన కార్యం ఏదైనా ఉంటే సెలవీయండి తప్పక నెరవేరుస్తాను"అన్నాడు. "మహారాజా మన ఉజ్జయినికి తూర్పుదిశగా ఉన్న కాళీ ఆలయంలో నేను హామం చేస్తున్నాను.అది లోక కల్యాణం కొరకు జరుగుతుంది. ఆ ఆయానికి క్రోసెడు దూరంలో తూర్పుదిశన స్మశానంలో మోదుగ చెట్టుకు శాపగ్రస్తుడు అయిన బేతాళుడు శవాన్ని ఆవహించి తల్లకిందులుగా వేళ్ళాడుతుంటాడు.అతన్ని పట్టి బంధించి భుజాన వేసుకుని నావద్దకు మౌనంగా తీసుకురా! అతనితో నీవు మాట్లాడితే బేతాళుడు మరలా తిరిగి చెట్టుపైకి చేరతాడు.బేతాళుని బంధించగల సమర్ధత నీవంటి వీరుడికే సాధ్యం.విజయోస్తు వెళ్ళిరా!"అన్నాడు విప్రుని వేషంలోని మాంత్రికుడు. ఉత్సహంగా తూర్పుదిశ గా బయలు దేరి వెళ్ళి విప్రుడు చెప్పిన ఆనవాళ్ళును సరిచూసు కుని స్మశానంలో ప్రవేసించి మోదుగ చెట్టుకు తల్లకిందులుగా వేళ్ళాడుతున్న బేతాళుని పట్టి బంధించి భుజాన వేసుకుని మౌనంగా విప్రుడు ఉన్న కాళీ మాత ఆలయానికిబయలుదేరాడు విక్రమార్కుడు. 'మహీపాల సకల కళావి శారదుడివి,సాహసివి, ఔషద,విద్య,అన్న, పంథా, ఘట్ట,గృహ,ద్రవ్య,కన్యా,జల'ఛాయ,దీప,వస్త్ర,గో,భూ,తిల,హిరణ్య,రత్న, ఆజ్య,వస్త్ర,ధాన్య,గుడ,రౌష్య,సాత్వక,రాజస,తామస గుణశాలివి కాళికామాత వరప్రసాదివి.నీఅంతటి వాడికే నేను లొంగేది.నన్ను ఏకారణంచే బంధించి తీసుకు వెళుతున్నావు అంతటి అవసరం ఏమోచ్చింది? అన్నాడు.శవంలోని బేతాళుడు. 'బేతాళా లోక కల్యాణం కొరకు ఓ విప్రుడు యాగం చేస్తు నిన్ను తనకి అప్పగించమని కోరాడు అందుకే నిన్ను తీసుకువెళు తున్నాను'అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కునికి మౌనభంగం కావడంతో బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టుపైకి చేరాడు. పట్టు వదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు వెనుతిరిగాడు.


కామెంట్‌లు