కరోనా ఆటవెలది పద్యాలు 121) సకల హంగులద్ది సౌకర్యాలను చేసి గచ్చిబౌలి నందు గడపమంటు ముందు చూపుతోని ముచ్చటైనాస్పత్రి వేల మంది కొరకు బెడ్లు పరిచి 122) రోజు రోజు లెక్క తాజా యనుచు చెప్పి పొంచివున్నదంటు వోర్చుతుండ్రి పరుగు పెట్టినది పాతిక వేలుగా ప్రకటనందు తెలిపి పట్టుమనిరి 123) పండుగేదియైన దండిగా కదలోద్దు ప్రార్థనంత కూడ బయట లేదు రంది మీకు వలదు రంజాను పొద్దును ఇంటి పట్టునుండి యిడువు మనిరి 124) మారలేని మనిషి మార్పుకై పోలీసు జానపదుల తెచ్చి జట్టుకట్టి పాడు పనులు మరువ పాట నటన తోని రోడ్డుపైన యాడి రూల్సు తెలిపి 125) ధాన్యమంత కూడ దండిగా కొనుటకు పల్లె జేరినారు ప్రతినిధులంత గన్ని సంచులన్ని సమకూర్చి రైతుకు చెక్కులిచ్చినారు చిక్కులేక 126) రాళ్ళ వానతోని రైతన్న కలకల వడ్లు, కాయలన్ని పడెను క్రింద ధాన్యమంత కూడ తడిసిన సమయాన బిక్కు బిక్కుమనెను భీదరైతు 127) పల్లెలందు చాల పట్టుత్వ ముండెను పట్నమందు చాన పట్టుతప్పె నాయకత్వలేమి నగరాన వుండును పల్లె కట్టుబాటు ప్రగతి తోడ 128) సంచులన్ని నింపి సరుకుల మూటతో వలసలందు కలిసి పంచుతుండ్రి బ్రతకలేని తమను పలకరించిన వాళ్ళ దైవమంటు తలచి దండమెట్రి 129) అసలు వడ్డియనక యప్పుముచ్చట లేదు బతికినంక లెక్క బాధలేదు రియలు దందలేదు బయట తిరగలేదు మాట ముచ్చటాడ మనసులేదు 130) కదలకుండ వుండ పదిలముగ కరంటు దినము మొత్తమిచ్రి దివ్యముగను చిత్రమైన పాత సినిమాల సందడి నవ్వుతుండ్రి నేడు నవతరముగ ఉండ్రాళ్ళ రాజేశం
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం :సిహెచ్.పూజ-8వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాలఘణపురం మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

చిత్రం : -బి.ఈశ్వరి,-9వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాల గణపురం మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

బాల కథల పోటీ -2025
• T. VEDANTA SURY

చిత్రం : బి.దీక్షిత-10వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాల ఘణపురం మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి